create counter
Telugu Talks.Com
ఈ ఏడుపు నా వల్ల కాదే
భర్త : ఒసేయ్ రోజూ ఈ ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళు మండిపోతున్నాయే ... భార్య :మిమ్మల్ని ఇలా ఏడిపించడం నాకేమాత్రమూ ఇష్టం లేదు ... ఉండండి ఇపుడే వస్తా భర్త :హమ్మయ్యా ... మొత్తానికి ఉల్లిపాయలు కోయడానికి ఒప్పుకున్నావ్ భార్య : చూయింగ్ గమ్ తింటూ ఉల్లిపాయలు కొస్తే కన్నీళ్ళు రావంట .. మొన్న పేపర్ లో చదివా ఇదిగో చూయింగ్ గమ్ ... తింటూ కొయ్యండి
వంశ పారంపర్యం
"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్. "అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.
పిల్లలే...
ఉపాధ్యాయుడు: మీ ఊరిలొ పుట్టిన ప్రముఖుల పేర్లు చేప్పు విధ్యార్ధి: మా ఊరిలొ ప్రముఖులు పుట్టరుండి అందరూ పిల్లలే పుడతారు..........
అరుపు
"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు "అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి. "మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు "మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.
పోయినోళ్ళు
"మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో గాంధీ... ఒక్కో నెహ్రూ... ఒకో ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి" ఆవేశంగా పాఠం చెబుతున్నాడు మాస్టారు. "అంటే మేమందరం చావాలనా మీ ఉద్దేశ్యం?" లేచి కోపంగా అడిగాడో విద్యార్ధి.
గెడ్డం
"నేను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు గెడ్డంగీస్తాను. మరి నువ్వురా సుధాకర్" అడిగాడు గోవిందరావు. "ఓ నలభై, ఏభై సార్లు" చెప్పాడు సుధాకర్. "ఏంటి... అన్నిసార్లా... నీకేమైనా పిచ్చా?" " కాదురా... ఈమధ్య సెలూన్ స్టార్ట్ చేశాను"
ఇంటివాడు
చిలకజోస్యం చెప్పేవాడి మీద మండిపడిపోతున్నాడు జగన్నాధం "ఏం జ్యోతిష్యమండీ మీ బొంద! త్వరలో నేనొక ఇంటివాడినౌతానన్నారు. సంవత్సరం తిరిగినా పెళ్ళి కాలేదు సరి కదా అప్పులెక్కువై ఉన్న రెండు ఇళ్ళలో ఒక ఇల్లు అమ్మి వేయవలసి వచ్చింది" అన్నాడు. "మరింకేమండీ! ఇప్పుడు మీరు ఒక్క ఇంటివారే కదా! నా జ్యోతిష్యాన్ని తిడతారేం?" అన్నాడు జ్యోతిష్కుడు.
తెల్ల వెంట్రుక
"ఇవాళ వంట నువ్వు చేశావా అమ్మా?" అడిగాడు కొడుకు. "ఎలా కనుక్కున్నావురా?" అడిగింది తల్లి. "చారులో పొడవాటి తెల్ల వెంట్రుక వచ్చింది. నాన్నిది బట్టతల కదా" చెప్పాడు సుపుత్రుడు.
రామదాసు
Teacher : రామదాసు అసలు పేరేంటి రవీ! రవి : అక్కినేని నాగార్జున teacher.
అగ్ని ప్రమాదం
ఒక పెద్ద భవనం మంటల్లో ఆహుతైపోతున్నది. అప్పారావు అటుగా వెళ్తున్నాడు. "అయ్యో..... అయ్యో... ఆ భవనం అలా కాలిపోతుంటే అలా చోద్యం చూస్తారేంటి. వెంటనే Fire stationకి phone చెయ్యండి" అరిచాడు. "ఆ కాలిపోయేది Fire Stationఏ నాయనా" బదులిచ్చాడో ఆసామి.
దగ్గు
రాఘవయ్య అర్దరాత్రి లేచి విపరీతంగా దగ్గుతున్నాడు. అరగంట సేపు దగ్గిన తరువాత భార్యకు మండిపోయింది. "అబ్బబ్బ... మీదగ్గు వినలేకపోతున్నాను" అన్నది. "నన్ను మాత్రం ఏమి చేయమంటవు. ఇంతకన్న పెద్దగా దగ్గటం నావల్ల కాదు. ఖళ్ ఖళ్ ఖళ్...."
లాంఛనాలు...
"అల్లుడుగారూ.. కట్నం విషయం కుదిరింది కాబట్టి లాంఛనాల విషయం మాట్లాడుకుందాం. Scooter, Colour TV, ఇవ్వాలనుకుంటున్నాం ఏవంటారు?" కాబోయే అల్లుడిని అదిగాడు రామనాధం. "ఎందుకండీ నా కలాంటివేమీ వద్దు. ఒక washing machine, ఒక grinder ఇప్పించండి చాలు. నాకు పని తప్పుతుంది" అనాడు “ముందుచూపుతో” నారాయణ.
సిగ్గు లేదా?
Judge : మళ్ళీ మళ్ళీ courtకి రావటానికి నీకు సిగ్గు లేదా? నేరస్థుడు : మరి మీకు? నేను అప్పుడప్పుడు మాత్రం వస్తున్నాను. మీరు రోజూ వస్తున్నారుగా?
బరువు..
"ఏమే దుర్గ... ఈ మధ్య బరువు తగ్గాలని నెలరోజుల నుంచీ గుర్రపు స్వారీ చేస్తున్నావటగా? ఏవైనా బరువు తగ్గావా ?" ఆశగా అడిగింది పార్వతి. "హు.... ఏం తగ్గడమో ఏమో? మా గుర్రం మాత్రం ఇరవై కేజీలు బరువు తగ్గింది" నిట్టూరుస్తూ చెప్పింది దుర్గ.
పుట్టిన రోజు!!!
Teacher : ఒరేయ్ రాము! నీ పుట్టిన రోజు ఎప్పుడు? రాము : August 14 న teacher. Teacher : ఏ సంవత్సరం? రాము : ప్రతి సంవత్సరం. Teacher : !!!!!
ప్రశాంతం!!
"పెళ్ళై ఏభై ఏళ్ళు కాపురం చేసిన తరువాత ఇప్పుడు భార్యకు విడకులివ్వాలనుకుంటున్నారా? నాలుగైదేళ్ళలో మీరు కూడా చావబోతున్నారు?" కోపంగా అడిగాడు Judge. "చచ్చేముందైనా కాస్త ప్రశాంతంగా చద్దామని యువరానర్" దవడలాడించాడు తాతారావు.
ఇంగ్లీషులో చెప్పు ...
పిల్లలను పరిచయం చేసుకుంటున్నాడు కొత్త మాస్టారు మాస్టారు : ఒరేయ్.. నీ పేరు, మీ నాన్న పేరు చెప్పరా.. విద్యార్థి : నా పేరు చిట్టిబాబు, మా నాన్న పేరు సూర్యప్రకాశ్ అండీ.. మాస్టారు : ఏదీ.. దాన్నే ఇంగ్లీషులో చెప్పు చూద్దాం.. విద్యార్థి : నా పేరు లిటిల్ బాయ్, మా నాన్న పేరు సన్ లైట్ అండీ.. మాస్టారు : ఆ ??!
ఎవరు దూరం..
రాము : రేయ్ రాజూ.. నేనో ప్రశ్న అడుగుతా.. జవాబు చెప్పు.. రాజు : అలాగే..రాము : మనకు అమెరికా దూరమా.. సూర్యుడు దూరమా.. రాజు : అమెరికానే దూరం.. రాము : ఎలా చెప్పగలవు.. రాజు : ఏముంది.. మనం రోజూ సూర్యుణ్ణి చూడగలం కానీ.. అమెరికాను చూడలేం కదా.
స్కూలులో ఎవరంటే ఇష్టం?
"విద్యార్థులూ మీకు మీ స్కూలులో ఎవరంటే ఇష్టం?" అని అడిగారు డీఇఏ విద్యార్థుల్ని "అటెండరంటే మాకు చాలా ఇష్టం"! అన్నారు విద్యార్థులు "ఎందుకుని?" అడిగారు డీఇఏ "మేము ఇళ్ళకు వెళ్ళాలంటే బెల్‌ కొట్టవలసింది... అతనే కదండీ"! అన్నారు విద్యార్థులు.
సార్ టైమెంతయింది?
"సార్ టైమెంతయింది?" అడిగాడు సుధీర్ "తొమ్మిదీ పది" చెప్పాడు వాచి చూసి శంకర్ "కరెక్టుగా చెప్పండి?" సార్ "మరీ గంటతేడాతో చెబుతారేం"! విసుకున్నాడు సుధీర్